Anuraagapoornuda అనురాగపూర్ణుడా song lyrics

Click here to listen on YouTube.

Telugu Lyrics:

నీకేగా నా స్తుతిమాలికా 

నీకొరకే ఈ ఘన వేదికా “1”

నీ ప్రేమ నాపై చల్లారిపోదు

మరణానికైనా వెనుదిరుగలేదు

మనలేను నేను నిన్ను చూడకా

మహాఘనుడా నా యేసయ్యా “1”    “నీకేగా”


సంతోష గానాల స్తోత్రసంపద

నీకే చెల్లింతును ఎల్లవేళలా “1”

అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా

నీ గుణశీలత వర్ణింపతరమా “2”

నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా

నీవులేని లోకాన నేనుండలేనయ్యా

నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా

నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా “1”    “నీకేగా”


నీతో సమమైన బలమైన వారెవరు

వేరే జగమందు నే ఎందువేదకినను “1”

నీతిభాస్కరుడా నీ నీతికిరణం

ఈ లోకమంత ఏలుచున్నదిగా “2”

నా మదిలోన మహారాజు నీవేనయ్యా

ఇహ పరమందు నన్నెలు తెజోమయ్యా

నీ నామం కీర్తించి ఆరాధింతును

నీ నామం కీర్తించి ఆరాధింతును “1”    “నీకేగా”


నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు

వేరే అశేమియు లేదు నాకిలలో “1”

నా ప్రాణప్రియుడా నన్నేలు దైవమా

నా పాదమస్తకం నీకేగా అంకితం “2”

నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా

నా జీవిత అధ్యంతం నీవేనయ్యా

నీకొరకే నేనిలలో జీవింతును

నీకొరకే నేనిలలో జీవింతును “1”    “నీకేగా”

Comments

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva