Posts

Showing posts from November, 2024

Emmanuel baludu song lyrics

ఇమ్మానుయేలు   బాలుడు Click here to listen on YouTube. Telugu lyrics: ఇమ్మానుయేలు   బాలుడు సొగసైన   సౌందర్య   పుత్రుడు       “2” మహిమనే   విడిచాడు   మార్గమై   వచ్చాడు   సర్వమానవాళిని   రక్షింపను      “2” ఆ   బాలుడే   యేసు   బాలుడు   సర్వలోకానికి   ఏకైక   రక్షకుడు ఆ   బాలుడే   క్రీస్తు   బాలుడు సర్వమానవాళి   పాప   పరిహారకుడు     2” 1.  పరము   నుండి   దూతలు   దిగివచ్చిరి   పాటలు   పాడి   ఆరాధించిరి  “2” గొల్లలేమో   పరుగునోచ్చిరి   క్రీస్తుని   చూసి     సాగిలపడిరి …”2”       “ ఆ   బాలుడె ” 2.  పాపుల   పాలిట   రక్షకుడు రోగుల   పాలిట   ఘనవైద్యుడు  “2” నిన్ను   నన్ను   రక్షింపను   భూలోకమున   ఉదయించెను      “2”      “  ఆ   బాలుడె  “ 3.  మహా   మహిమ   లోకమునకు ...

Dunnani Beedu Bhoomulalo Song Lyrics

Click here to listen on YouTube. దున్నని బీడు భూములలో Telugu Lyrics : నడిపించు నా దేవా - జరిగించు నీ సేవ  చూపించు ఓ త్రోవ - పయనానికి ఓ ప్రభువా “2” దున్నని బీడు భూములలో - ఎవ్వరూ పోని స్థలములలో  రక్షణ లేని మనుష్యులలో - మారుమూల పల్లెలలో “2” ఎవరో వేసిన పంటను కోసే - పరిచర్య వద్దయ్యా  నీ పిలుపును విని పరుగున వచ్చే - ఆత్మలను ఇవ్వయ్య “2” పరులకు చెందే స్వాస్థ్యము తినే - పురుగుగా వద్దయ్యా  నశించు దానిని వెదకి రక్షించే - భారమును ఇవ్వయ్యా    “2”. “దున్నని” ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమే వద్దయ్యా  ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా “2” కష్టము లేక సుఖముగా వచ్చే -    ఫలమే వద్దయ్యా  కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా    “2”.    “దున్నని” ఇతరుల ఆస్తిపై కన్ను వేసే - దొంగను కానయ్యా  స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను యేసయ్యా    “2” నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా  మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా    “2”    “దున్నని”

జాలి చూపేవారు లేక | Jaali choope vaaru leka song lyrics

జాలి చూపేవారు లేక Click here to listen on YouTube. Telugu lyrics: జాలి చూపేవారు లేక - జారిపోయిన హృదయమా మనసే లేని మనుషులంతా మనసు గాయం చేసిరా.. నీ మనసు గాయం చేసిరా     “జాలి” ప్రేమరూపి కలనైనా మరువలేడమ్మా.. నిను మరువలేడమ్మ     “ జాలి “ 1. దేవుడేమి చేసాడంటూ -దీవెనేమి చూసావంటు  నిందించిరా -నిన్ను నిలదీసిరా. కాలామంతా కలగానే మిగిలిపోవు ననుకుంటూ  క్రుంగిపోతివా- నీవు కుమిలి పోతివా ఓటమి ఎపుడు అంతమే కాదని తెలుసుకోవమ్మా  గెలుపు ఉండకపోదమ్మా    “జాలి” 2. నేనేం తప్పు చేశానంటూ -నాకే ఎందుకు ఇలా అంటూ  తలచుచుంటివా -బ్రతుకే భారమంటివా నీవెన ఆస్తి అంటూ -తగిన కాలం వస్తుందంటూ  మాటనిచ్చిన యేసుని -మాట మరచితివా  నిందించే మనుషులేదుటే-నిలుపునో అమ్మా  మేలు కలుగునో అమ్మా.. “జాలి”

నా యేసయ్యా | Naa Yesayya nee krupanu maruvalenayya song lyrics

Image
నా యేసయ్యా Click here to listen on YouTube Telugu lyrics: నా యేసయ్యా.. నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా.. నీ దయలేనిదే బ్రతకలేనయ్యా.. “2” నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము “2” తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద.. “2” ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న…    “నా యేసయ్యా..” నా గుమ్మముల గడియలు బలపరిచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరిచితివి “2” నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న…    “నా యేసయ్యా..” నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి “2” నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న….    “నా యేసయ్యా..” English lyrics: Naa Yesayya Nee krupa maravalenayya Naa Yesayya Nee dayalenide bratakalenayya “2” Nee naama smaranalo dagina jayamu Nee vaakya dhyanamulo pondina balamu “2” Talachukunuchu naa yaatranu Ne konasagincheda “2” Aah… Hallelujah… Oho… Hosanna…    “ Naa Yesayya “ Na...

యేసుని జననం | Yesuni Jananam Song lyrics

  యేసుని జననం Click here to listen on YouTube. Telugu Lyrics : Verse-1 రాజులకే రారాజువు లోకానికి వెలుగై ఉదయించెను సింహాసనముపై ఆశీనుడు సామాన్యుడిగా దిగివచ్చెను    “2” సర్వోన్నతుని కుమారుడు - సర్వజనులకు రక్షకుడు    “2” Chorus   ఓహో ఆనందమే సంతోషమే  శ్రీ యేసుని జననం అద్భుతమే    “2”  మేము సాగిలపడి నిన్నే సేవింతుము  మేము సాగిలపడి నిన్నే పూజింతుము    “2” Verse-2  మన పాపభారం తొలగింపను ఈ భూవికే రక్షణ తెచ్చెను  విడువని కృపతో ప్రేమించెను శాశ్వత జీవం మనకిచ్చేను     “2”  ఇమ్మానుయేలుగా ఉదయించె  మాతోడుగా నిత్యముండును    “2” Bridge-1  నీ నామమెంతో ఉన్నతం  నీ వాగ్ధానములు శాశ్వతం  నీ ప్రేమయే నిరంతరం  యేసయ్య..... యేసయ్య... Bridge-2  నీ వాక్యమెంతో మధురం  నీ కార్యములు ఆశ్చర్యములు  నీ రాజ్యమే నిరంతరం  యేసయ్య..... యేసయ్య..... Chorus-2   ఓహో ఆనందమే సంతోషమే  శ్రీ యేసుని జననం అద్భుతమే    “2”  మేము సాగిలపడి నిన్నే సేవింతుము  మ...

Divilo Veduka Christmas song lyrics

దివిలో వేడుక Click here to listen on Youtube. Telugu Lyrics: దివిలో వేడుక - ఊరంతా పండుగ - నేడే రారాజు పుట్టెనే ఇలలో జాడగా - ఆ నింగీ తారక - వెలిసే ఈ వింత చూపగా మహా సంతోషమే - ఆహా ఆనందమే ఆహా ఈ రేయిలో    - ఓహో ఉల్లాసమే     ఇల మెస్సయ్య - జన్మించినాడుగా మన యేసయ్య - ఉదయించినాడుగా మహారాజు - మన యేసు నిన్నే కోరీ - ఇలా వచ్చెనే జగాలేలే    - మన యేసు నిన్నే చేర - దిగి వచ్చెనే 1.దేవ దేవుడే - మరియ తనయుడై ధరలో దీనుడై - పుట్టే పుణ్యుడై పరిశుద్ధాత్ముడే - పాపరహితుడై ప్రేమపూర్ణుడే - పరమ జీవమై  లోకాన్ని వెలిగించ వచ్చాడుగా నిను దీవించి తన ప్రేమ చూపాడుగా దారే చూపంగ దేవుడే దయతో దీపంగ నిలిచెనే 2.ఆడే గొల్లలు - పాడే దూతలు వచ్చిరి జ్ఞానులు - వేడిరి యేసుని           ఆ పశుపాకలో - పొంగే సంబరం మనకు రక్షణై    - యేసు ఈ దినం  పాపాన్ని తొలగించ వచ్చాడుగా నిను కరుణించి తన జాలి చూపాడుగా  కృపతో కాపాడ వచ్చెనే చెలిమై చల్లంగ చూసెనే English Lyrics: Divilo Veduka - Oorantha Panduga - Nede Raraju Puttene Ilalo Jaadaga - Aa Ningi Thaaraka - Velise E...