Ashrayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025

ఆశ్రయుడా నా యేసయ్య

Click here to listen on YouTube.

Telugu Lyrics:

ఆశ్రయుడా నా యేసయ్య 

స్తుతి మహిమా ప్రభావము నీకేనయ్యా. “2”

విశ్వవిజేతవు_సత్యవిధాతవు

నిత్య మహిమకు_ఆధారము నీవు  “2”

లోకసాగరాన కృంగినవేళ 

నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి

నను చేరదీసిన నిర్మలుడా

 

నీకేనయ్యా ఆరాధన 

నీకేనయ్యా స్తుతి ఆరాధన  “2” “ఆశ్రయుడా యేసయ్య”



తెల్లని వెన్నెలకాంతివి నీవు 

చల్లని మమతల మనసే నీవు “2”

కరుణని చూపి కలషము బాపి

నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు “2”

జనులకు దైవం జగతికి దీపం నీవు గాక ఎవరున్నారు 


నీవే నీవే ఈ సృష్టిలో 

కొనియాడబడుచున్న మహారాజవు “2”     “ఆశ్రయుడా”



జీవితదినములు అధికములగునని వాగ్దానము చేసి  దీవించితివి “2”

ఆపత్కాలమున అండగానిలిచి 

ఆశల జాడలు చూపించితివి “2”

శ్రీమంతుడవై సిరికే రాజువై 

వ్యధలను బాపి నా స్థితి మార్చితివి 


అనురాగమే నీ ఐశ్వర్యమ

సాత్వికమే నీ సౌందర్యమా “2”   “ఆశ్రయుడా”



నీ చిత్తముకై అరుణోదయమున 

అర్పించెదను నా స్తుతి అర్పణ “2”

పరిశుద్ధులలో  నీ స్వాస్థ్యము యొక్క

మహిమైశ్వర్యము నే పొందుటకు “2”

ప్రతి విషయములలో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో 

ప్రార్థించేదను


పరిశుద్ధుడా పరిపూర్ణుడా

నీ చిత్తమే నాలో నెరవేర్చుమా  “2”  “ఆశ్రయుడా”

Comments

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva