Posts

Showing posts from March, 2024

Kannuletthuchunnanu | కన్నులెత్తుచున్నాను song lyrics

కన్నులెత్తుచున్నాను Click here to listen on YouTube. Telugu Lyrics: స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రము యేసయ్యా “2” ఆకాశమువైపు నా కన్నులేత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా “1” ఆకాశంవైపు నా కన్నులేత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా “1” కలవరమునొందను నిన్ను నమ్మియున్నాను “2” కలత నేను చెందను కన్నీరు విడువను “2”         “ఆకాశంవైపు” ఆకాశముపై నీ సింహాసనంయున్నది రాజదండముతో నన్నేలుచున్నది “2” నీతిమంతునిగా చేసి నిత్యజీవమనుగ్రహించితివి “2” నేనేమైయున్నానో అది నీ కృపయేకదా “2”         “ఆకాశంవైపు” ఆకాశమునుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచనచేత నన్ను నడిపించుచున్నావు “2” నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి “2” నీవుండగా ఈ లోకంలో ఏదియు నాకక్కర లేనేలేదయ్యా “2”         “ఆకాశంవైపు” ఆకాశమునుండి అగ్ని దిగివచ్చియున్నది అక్షయజ్వాలగా నాలో రగులుచున్నది “2” నా హృదయమే నీ మందిరమై నీ తేజస్సుతో నింపితివి “2” కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరము నివసించితివి “2”         “ఆకాశంవైపు” ఆకాశము న...

Siluvalo Vreeladee ॥ సిలువలో వ్రేలాడే song lyrics in telugu

Click here to listen on YouTube. Telugu Lyrics : సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే  యేసు నిన్ను పిలచుచుండే  ఆలస్యము నీవు చేయకుము  యేసు నిన్ను పిలచుచుండే “2” కల్వరి శ్రమలన్ని నీ కొరకే  ఘోర సిలువ మోసి కృంగుచునే “2” గాయములచే బాధనొంది  రక్తము కార్చే హింసనొంది “2”    “సిలువలో” నాలుక యెండెను దప్పిగొని  కేకలు వేసెను దాహమని “2” చేదు రసమును పానము చేసి  చేసెను జీవాయాగమును “2”    “సిలువలో” అగాధ సముద్ర జలములైన  నీ ప్రేమను ఆర్పజాలవుగా “2” ఈ ప్రేమ నీకై విలపించుచూ  ప్రాణము ధారాపోయుచుండే “2”    “సిలువలో”

Sravya spadhanam | శ్రావ్యసదనము song lyrics

శ్రావ్యసదనము Click here to listen on YouTube. Telugu Lyrics: నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీవే సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా “2” నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము “1” విరజిమ్మే నాపై కృప కిరణం  విరబూసే పరిమళమై కృప కమలం “2” విశ్వాస యాత్రలో ఒంటరినై విజయ కిరణము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్యా “1” నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము “1” నీ నీతి నీ రాజ్యం వేదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు “2” నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు నన్ను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా “1” నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము “1”      పరిశుద్ధత్మకు నిలయముగా ఉపదేశముకు వినయముగా “2” మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా “1”       “నీవే శ్రావ్య సదనము”

కరుణాసాగరా | Karunasaagara Song Lyrics

Karunasaagara Click here to listen on Youtube. English Lyrics: Karunasaagara yessaya  kanuaapaga nannu kachithivi unnathamaina prematho  manasuna mahimaga nilichithivi "2" "karunasagara" Maranapu loyalo dhigulu chendhaga abhayamu nondhithi ninnu chuchi  "2" dhaahamu theerchina jeevanadhi jeeva maargamu chupithivi "2"   "karunasagara" Yogyatha leni paatranu nenu shaswatha prematho nimpithivi  "2" odhigithi nee kaugililo odharchithivi vaakyamutho   "2"  "karunasagara" Akshaya swasthamu me pondhutaku sarwasatyamulo nadipithivi  "2" sampoorna parachi jyestulatho prema nagarilo cherchumayaa "2"   "karunasagara" Telugu Lyrics: కరుణాసాగర యేసయ్యా కనుపాపగా నన్ను కాచితివి “1” ఉన్నతమైన ప్రేమతో మనస్సున మహిమగా నిలిచితివి “2”    “కరుణాసాగర” మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి “2” దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి “2”    “కరుణాసాగర” యోగ్యతలేని పాత్రను నేను శాశ్వత ప్రే...

Anuraagapoornuda అనురాగపూర్ణుడా song lyrics

అనురాగపూర్ణుడా Click here  to listen on YouTube. Telugu Lyrics: నీకేగా నా స్తుతిమాలికా  నీకొరకే ఈ ఘన వేదికా “1” నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నేను నిన్ను చూడకా మహాఘనుడా నా యేసయ్యా “1”      “నీకేగా” సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా “1” అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా “2” నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా “1”      “నీకేగా” నీతో సమమైన బలమైన వారెవరు వేరే జగమందు నే ఎందువేదకినను “1” నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంత ఏలుచున్నదిగా “2” నా మదిలోన మహారాజు నీవేనయ్యా ఇహ పరమందు నన్నెలు తెజోమయ్యా నీ నామం కీర్తించి ఆరాధింతును నీ నామం కీర్తించి ఆరాధింతును “1”      “నీకేగా” నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే అశేమియు లేదు నాకిలలో “1” నా ప్రాణప్రియుడా నన్నేలు దైవమా నా పాదమస్తకం నీకేగా అంకితం “2” నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవిత అధ్యంతం నీవేనయ్యా నీకొరకే నేనిలలో జీవింతును నీకొరకే నేనిలలో జీవింతును “1...

జీవన మకరందం - Jeevanamakarandham

జీవన మకరందం - Jeevanamakarandham Click here to listen on Youtube. Telugu Lyrics: పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో “1” పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తియ్యని సంగీతం నీవే “1” తరతరములలో నీవే నిత్య సంకల్ప సారధి నీవే జగములనేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే    “1”       “పరిమళ” ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో “2” నేనున్న నీతో అంటు నీవే నాతో నిలిచినావు  క్షణమైన విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనస్సే అతిమధురం అది నా సొంతమే “1”       “పరిమళ” చీల్చబడిన బండనుండి నా కొదువతీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మశక్తితో కొరతలేని ఫలములతో నన్ను నీ రాజ్యమునకు పాత్రుని చేయా ఏర్పరచుకొంటివి నీ స్వస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్ధం వాడబడే నీ పాత్రను నేను “1”       “పరిమళ”   వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నాకోసం వస్తావని నిన్ను చూచినవేళ నాలో ప్రాణం ఉద్వెగభరింతమై నీ కౌగిట ఒరిగి ఆనందముతో నీలో మమేకమై యుగయుగములలో నీతో నేను నిలిచిపోదును “1”       “...

Nuthanamaina Krupa song lyrics

Nuthanamaina Krupa Click here to listen on YouTube. Telugu Lyrics: నూతనమైన కృప - నవ నూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప  నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా!  నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా....  ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం నాక్రయధనముకై రుధిరము కాంతివి ఫలవంతములైన తోటగా మార్చితివి  ఫలితముకొరకైన శోధన కలిగినను  ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్నివేళలయందు ఆశ్రయమైనావు  ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా  ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను పలువేదనలలో నీతో నడిపించి  తలవంచని తెగువ నీలో కలిగించి  మదిలో నిలిచావు - మమతను పంచావు  నా జీవితమంతా నిను కొనియాడెదను  ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా  ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం సాక్షి సమూహము మేఘమువలెనుండి  నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందముచూచి కృపమహిమైశ్వర్యం నే పొంది...