Prabhuva Ne Ninnu Nammi song lyrics
ప్రభువా! నే నిన్ను నమ్మి ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు " ప్రభువా " నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు " ప్రభువా " పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు " ప్రభువా " జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు నే జారిపోకుండ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు " ప్రభువా " నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా! " ప్రభువా "